‘భగీరథ’ వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే

19 Oct, 2017 05:24 IST|Sakshi

నమోదు చేయాలని అధికారులకు ఈఎన్‌సీ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సురేందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆన్‌లైన్‌ నివేదికలను మాత్రమే ఇకపై ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మరింత పారదర్శకత కోసమే భగీరథ పనులన్నింటినీ ఆన్‌లైన్‌ చేశామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం గుర్తించిన సంస్థల నుంచే ఎయిర్‌ వాల్వ్, ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌తో పాటు ఇతర పరికరాలు కొనుగోలు చేసేలా వర్క్‌ ఏజెన్సీలను పర్యవేక్షించాలన్నారు. డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు నీళ్లివ్వాలంటే ఇంతకు రెట్టింపు ఫలితాలను సాధించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు