వలస జీవుల తంటాలు

20 Aug, 2014 03:11 IST|Sakshi

మోర్తాడ్:మోర్తాడ్ మండలం తొర్తికి చెందిన పోచయ్య ఉపాధి కోసం ముంబాయిలో ఉంటున్నాడు. సమగ్ర సర్వే కోసం రెండు రోజుల కింద స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే, స్థానికంగా నివాసం ఉండటం లేదం టూ ఆయన వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్‌లు స్పష్టం చేశారు. దోంచందకు చెందిన సంజీవ్‌కుమార్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తూ నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.

 సర్వేలో వివరాలను న మోదు చేయించుకునేందుకు కుటుంబం సహా స్వగ్రామానికి వచ్చారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉంటున్న వా రి వివరాలు సేకరించడానికి తమకు ఇబ్బంది లేదని, నిజామాబాద్‌లో ఉంటున్నవారి వివరాలను మాత్రం ఇక్కడ సేకరించమని సర్వే బృందం తేల్చి చెప్పింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలా మంది నిరాశకు గురయ్యారు.

 ఎవరూ పట్టించుకోక
  సర్వే కోసం ఎన్నో తంటాలు పడుతూ స్వగ్రామాలకు చేరుకున్నవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వా రి కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక ముంబాయి, పూణే, భీవండితోపాటు ఇతర పట్టణాలకు వలస వెళ్లిన తెలంగాణవాసులు సర్వే కోసం సొంత ఊళ్లకు వస్తే వివరాలను న మోదు చేయక పోవడంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం చో టు చేసుకుంది. తమ వివరాలను నమోదు చేయడం లేదంటూ  టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం లే కపోయింది. అందుబాటులో ఉన్న అధికారులకు ఫో న్ చేస్తే వారు విసుక్కున్నారు. కొందరు అధికారులు తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో జనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 స్టిక్కర్ల గొడవ
 సర్వే నిర్వహించడానికి గుర్తింపు కోసం స్టిక్కర్‌లను అతికించారు. కొన్ని ఇళ్లకు అతికించలేదు. స్టిక్కర్‌లతో సంబంధం లేకుండా సర్వే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా, స్టిక్కర్‌లు లేని కారణంగా ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలను సర్వే బృందం నమోదు చేయలేదు. స్టిక్కర్‌లు అతికించిన రోజున సిబ్బంది నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే సర్వే రోజున వివరాలను సేకరించారు.

  సర్వే విధివిధానాలు అర్థం కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్వేపై ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రచారం చేసినా సర్వేలోని ఆంశాలు, వివరాలు సేకరించిన తీరుతో జనంలో అపోహలు మరింత ఎక్కువయ్యాయి.

మరిన్ని వార్తలు