15 నిమిషాల్లో యాప్‌

7 Jun, 2018 11:48 IST|Sakshi

వ్యాపారాభివృద్ధికి ఆన్‌గో సంస్థ చేయూత  

వస్తువుల తయారీ, ఎగుమతుల్లో కీలక భూమిక  

సాక్షి, సిటీబ్యూరో : మీ వ్యాపారం.. చిన్నదైనా.. పెద్దదైనా.. డిజిటల్, ఆన్‌లైన్‌ మాధ్యమంలో స్మార్ట్‌గా వినియోగదారులను చేరేందుకు ఓ వినూత్న మొబైల్‌యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌గో సంస్థ వినూత్న సృష్టితో కేవలం 15 నిమిషాల్లో మీ వ్యాపారానికి చోదకశక్తిని అందించే మొబైల్‌యాప్‌ను ఈ సంస్థ సృష్టిస్తోంది. ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ కోసం యాప్‌ సిద్ధంచేస్తే రూ.2 వేలు, ఐఓఎస్‌ మొబైల్స్‌కు సిద్ధం చేస్తే రూ.3 వేలు మాత్రమే చార్జీ చేస్తుండడం విశేషం. హైదరాబాద్‌ కేంద్రంగా వెలసిన ఈ అంకుర సంస్థ చిన్నవ్యాపారులకు ఓ వరంలా మారింది. ఉపాధి కల్పన.. పెట్టుబడుల ప్రవాహం.. వినియోగదారులకు అవసరమైన వినియోగ వస్తువుల తయారీ, ఎగుమతుల్లో కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ యాప్‌ చోదకశక్తిని అందిస్తుండడం విశేషం.

ఆయా సంస్థలు తయారుచేస్తున్న ఉత్పత్తులను, వాటి విశిష్టతలు, ధరలు, ఉపయోగాలు, ఇతర ఉత్పత్తులకంటే భిన్నంగా లభ్యమవుతున్న సౌకర్యాలు, రాయితీలపై డిజిటల్‌ మాధ్యమంలో వినియోగదారులకు సమస్త సమాచారాన్ని అందించడమే మొబైల్‌యాప్‌ ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు వెయ్యి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మొబైల్‌యాప్‌లను సిద్ధం చేయడమే కాదు.. వీటిని గూగుల్‌ ప్లేస్లోర్‌లో అందుబాటులో ఉంచారు. యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుల మొబైల్స్‌కు లింక్‌ రూపంలో పంపిస్తుండడం విశేషం. యాప్‌ల తయారీ, నిర్వహణ బాధ్యతలను రెండింటినీ ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు సుమారు వెయ్యి చిన్న సంస్థలు, 65 బడా సంస్థలు, 475 సూక్ష్మ పరిశ్రమలు, మరో 25 స్టార్టప్‌లకు సంబంధించిన యాప్స్‌ సిద్ధం చేసినట్లు సంస్థ సీఈఓ రామకుప్ప తెలిపారు. 

ప్రత్యేకతలివీ.. 

  •      15 నిమిషాల్లో మీ వ్యాపారానికి సంబంధించిన మొబైల్‌ యాప్‌ను సృష్టిస్తుంది. 
  •   కృత్రిమ మేధస్సు అనువర్తనాలను వినియోగించుకొని అన్నిరకాల వ్యాపారాలకు అవసరమైన యాప్‌లను సిద్ధం చేస్తుంది. ఉదా: హోటల్స్, రెస్టారెంట్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు మొదలైనవి. 
  •    సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మొబైల్‌తోపాటు వెబ్‌బేస్డ్‌ యాప్‌లను తక్కువ ఖర్చుతో తయారు చేసి అందిస్తుంది. 
  •      మొబైల్‌ ఫస్ట్,లో కోడ్,నో–కోడ్‌ ప్రత్యేకతలతో ఈ సంస్థ యాప్‌ను సిద్ధంచేస్తుంది. 
  •      చిన్నవ్యాపారులు మార్కెట్‌అవకాశాలను విస్తృతం చేసుకునేందుకు ఈ యాప్‌ దోహదపడుతుంది.   
  •      మొబైల్, స్థానిక క్లౌడ్, ఆండ్రాయిడ్‌ అనువర్తనాలు, వెబ్‌ ఆధారిత అనువర్తనాలను రూపొందించడం.     
  •    చిన్నవ్యాపారులు ఎవరైనా తేలికగా డిజిటల్‌ వినియోగదారులకి చేరుకోవడం, మార్కెట్‌ అవకాశాలను విస్తృతం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.  

మీకూ కావాలా.. అయితే సంప్రదించండి.. www.ongoframework.com, 040 - 48532121

మరిన్ని వార్తలు