చెరువుల అభివృద్ధితోనే రైతుల్లో ఆనందం

18 May, 2016 09:08 IST|Sakshi

స్పీకర్ మధుసూదనాచారి
బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన

భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు అభివృద్ధి చెంది రైతన్నల్లో ఆనందం వెల్లువిరుస్తోందని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని దూదేకులపల్లి, దీక్షకుంట గ్రామాల శివారులలోని రేగడికుంట, కొత్తకుంట చెరువుల్లో మిషన్ కాకతీయ పథకం రెండవదశ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను శాసన సభాపతి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువులను అభివృద్ధి చేయడం మూలంగా నీటి సామర్ధ్యం మరింత పెరిగి ఆయకట్టు పెరుగుతుందన్నారు. తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు తగ్గుముఖం పడుతాయన్నారు. గౌడ, మత్స్యకార తదితర కుల వృత్తుల వారికి సైతం లాభదాయకంగా ఉంటుందన్నారు.

 
బాధితులను ఆదుకుంటాం

మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు దగ్ధమైన ఏడు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తానని శాసన సభాపతి మధుసూదనాచారి హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం రూ. 8 వేలు అందజేశారు.  ఆయా  కార్యక్రమాల్లో నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చెర్మైన్ ఎరుకల గణపతి, ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, ముంజాల నిర్మలరవీందర్, గోనె భాస్కర్, టీఆర్‌ఎస్ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, రాంపూర్ వెంకన్న పాల్గొన్నారు.

 
సుపరిపాలన అందుతోంది

గణపురం : ప్రజల ఆకాంక్ష మేరకు సుపరి పాలన తెలంగాణలో  సాగుతుందని శాసనసభ స్పీకర్, భుపాలపల్లి శాసన సభ్యులు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని గాంధీనగర్‌లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ మారగాని శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. ప్రజాధారణ కోసమే మరిన్ని కార్యక్రమాలను అందిస్తామని తెలిపారు. నియోజకవరగ్గంలో ఇప్పటికే వెయ్యికోట్ల అభివృద్ధిపనులు జరిగాయని చెప్పారు. గాంధీనగర్‌లో అంగన్‌వాడీ భవనం పెండింగ్ పనులకు రెండు లక్షలు, ప్రధాన కూడలిలో సోలార్ లైటింగ్ కోసం ఐదు లక్షలను నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచికేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు గుజ్జ లక్ష్మన్‌రావు, జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్, ఎంపీపీ పోతారపు శారద, ఎంపీటీసీ బొచ్చులక్ష్మిస్వామి,  సోసైటి అధ్యక్ష, ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్‌రావు,  పొట్లనగేష్,  భైరగాని కుమార్‌స్వామి,రత్నం రవి,కాల్వరాంరెడ్డి. దివిప్రసాద్,   మళ్లికార్జున్, గుర్రం తిరుపతి , ముక్కెర సాయిలు తదితరులు పాల్గొన్నారు.

 
సమృద్ధి నీటితోనే సస్యశ్యామలం

రేగొండ : పాడిపంటలు సస్యశామలంగా ఉండాలంటే సమృద్ధిగా నీరు ఉంటేనే సాధ్యమని స్పీకర్ సిరికొండ మధుసూధుసూధనాచారి అన్నారు. మండల కేంద్రంలోని వెంకటాద్రికుంట, లంబడికుంట, రామసంముద్రం, రంగయ్యపల్లే గ్రామంలోని గంగిరేణికుంట, కొడవటంచలోని నవ్వులకుంటల అభివృద్ధి పనులను స్పీకర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్టంలోనే అధిక చెరువులను భూపాలపల్లి నియోజక వర్గంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రుణ మాఫీతో పాటు రానున్న రోజుల్లో తాగు, సాగు నీరు అందించడమే ధేయ్యంగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలు ప్రవేశపెట్టి శరవేగంగా పనులు నిర్వహించే విధంగా కృషి చేస్తున్నారన్నారు.  ఐబీ డీఈ ప్రసాద్,ఎఈ వెంకటేశ్వర్లు, ఎంపీపీ ఈర్ల సదానందం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్, సర్పంచ్‌లు మోడెం ఆధిలక్ష్మి, పున్నం లక్ష్మి, పోగు వీరలక్ష్మి, ఎంపీటీసీ పట్టేం శంకర్, నాయకులు కోలుగురి రాజేశ్వర్‌రావు, పున్నం రవి, మైస భిక్షపతి, మటిక సంతోష్, బలేరావు మనోహర్‌రావు, అయిలి శ్రీధర్‌గౌడ్, తడక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు