గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

26 Apr, 2018 09:00 IST|Sakshi
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్, నాప్టా అధికారులు

నిరుపేదలకు నీడనిచ్చే గొప్ప ఆలోచన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

నాఫ్టా అధికారులు హరికృష్ణ, సీవీ రావు

పనుల వేగంపై కల్టెకర్‌కు ప్రశంసలు

భూపాలపల్లి రూరల్‌ : గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు హరికృష్ణ, సీవీ రావులు అన్నారు. పట్టణంలోని వేశాలపల్లిలో షేర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వారు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేదలకు నీడనిచ్చే గొప్ప ఆలోచన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లని, పనులు వేగంగా కొనసాగడానికి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రశంసించారు.

గ్రామపంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో రూపుదిద్దుకొని అంబేద్కర్‌ జయంతి నాటి నుంచి అమలులోకి వచ్చిన ప్రధానమంత్రి గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో వంద శాతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలెండర్లు, రూ.125 విద్యుత్‌ కనెక్షన్‌ ఇప్పించడం, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కార్యక్రమం ద్వారా పౌరలందరికీ బ్యాంక్‌ ఖాతాలను తెరిపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, సీపీఓ కొమురయ్య, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, ఎల్‌డీఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు