ఇదేమిటి యాదగిరీశా..?

14 Aug, 2019 12:11 IST|Sakshi

సాక్షి, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట  శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరమ పవిత్రం. తెలంగాణకే తలమానికంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని కొందరు అపవిత్రం చేస్తున్నారు. అత్యంత భక్తితో కొలిచే స్వామివారి సన్నిధిలోనే కొందరు పాదరక్షలు విడిచి అపవిత్రం చేస్తున్నా రు. అయినా దేవస్థానం అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

చెప్పుల స్టాండ్లు ఉన్నా.. 
యాదాద్రి దేవస్థానంలో  మూడు చెప్పుల స్టాండ్లు ఉÐన్నాయి.వీటిని  సంవత్సరానికి రూ.26లక్షలతో కాంట్రాక్టు కు అప్పగించారు. ఇవి కొండపైన  5 దుకాణాల్లో  చెప్పులు విడిచి దర్శనానికి వెళ్లాలని అధికారులు నిర్ణయించా రు. అయితే దేవస్థానంలోని కొంతమంది అధికారులే ఆలయానికి పాదరక్షలతో వచ్చి ద్వారాల ఎదుట విడుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఐపీలు దర్శనానికి వచ్చే క్రమంలో కూడా పాదరక్షలతోనే వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎంత పవిత్రంగా భావించే ఆలయ పరిసరాలు అపవిత్రం అవుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌  యాదాద్రిని తిరుమల మాదిరిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. తిరుమలలో దా దాపు ఐదు కిలోమీటర్ల దూరం నుంచే పాదరక్షలతో నడవకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే యాదాద్రిలో  భద్రతా సిబ్బంది కూడా  పట్టనట్లు వ్యవహరిస్తున్నానే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు తగు చర్యలు చేపట్టి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు