‘ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం’

12 Sep, 2019 16:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం కొనసాగుతోందని, ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో మొత్తం 5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. 35వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని తెలిపారు.

మరిన్ని వార్తలు