ఆ కానిస్టేబుల్‌ త్వరగా కోలుకోవాలి: డీజీపీ

13 Apr, 2020 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ రామచంద్రయ్య త్వరగా కోలుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దుండిగల్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న రామచంద్రయ్య లాక్‌డౌన్‌లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిం చి వాహనాన్ని ఆపకుండా ముందు కు పోనిచ్చాడు. అతన్ని పట్టుకునేందుకు మరో వ్యక్తి వాహనంపై రామచంద్రయ్య వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక వారి వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో గాయపడ్డ రామచంద్రయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

మేం అనుమతివ్వలేదు.. 
భువనగిరి పట్టణ సమీపంలో రోడ్డుపై ఓ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు తనిఖీలు చేస్తుండటంపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. వారంతా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని పలువురు ట్విట్టర్‌లో ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో తామెవరికీ, ఎలాంటి తనిఖీలు చేసే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

వెంకటేశ్, వరుణ్‌తేజ్‌లకు డీజీపీ కృతజ్ఞతలు 
లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తూ మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని కాపాడుతున్న పోలీసులు రియల్‌ హీరోలం టూ సినీ నటులు విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ చేసిన ట్వీట్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ‘మీ వ్యాఖ్యలు మాలో ఉత్సాహాన్ని నింపాయి. లాక్‌డౌన్‌కు సహకరించాలంటూ ప్రజలకు మీరు చేసిన విజ్ఞప్తికి ధన్యవాదాలు’అని ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు