లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డీజీపీ మహేందర్‌రెడ్డి

20 Apr, 2020 18:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టం  చేశారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తున్నామని  పేర్కొన్నారు. అవసరం లేకుండా బయటకు వచ్చే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారి పాస్‌లను రద్దు చేస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన పాస్‌లను వెనక్కి తీసుకుని కొత్త పాస్‌లిస్తామని తెలిపారు.
(ఇక‌పై ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినం : అంజనీకుమార్)

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాస్‌లు..
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాస్‌లు ఇస్తామని పేర్కొన్నారు. మూడు కి.మీ వెళ్లే ప్రతిఒక్కరూ రెసిడెన్స్‌ ఫ్రూఫ్‌ తీసుకురావాలన్నారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలని.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు