తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ

19 Dec, 2019 11:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ చంచల్‌గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్ట్స్‌ మీట్‌ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రిసనర్స్‌ స్పోర్ట్స్‌మీట్‌ను డీజీపీ, జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది ప్రారంభించారు. అనంతరం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి అని ప్రశంసించారు. పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీర్చిదిద్దడంలో రాజీవ్‌ త్రివేది పాత్ర మరువలేనిదన్నారు. రాజీవ్‌ త్రివేది ఆధ్వర్యంలో జైళ్లశాఖ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు.

అలాగే తన సహచరుడు రాజీవ్‌ త్రివేది డీజీగా ఉండటం.. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో గుర్తుండిపోయే విషయమన్నారు. రాజీవ్‌ త్రివేది మంచి  క్రీడా వ్యక్తి అని.. క్రీడలు మంచి లక్షణాలను నేర్పిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తితో అందరూ సమిష్టిగా రాణించాలని జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది సూచించారు. తెలంగాణ జైళ్లశాఖను ఉన్నతమైన స్థానంలో తీర్చిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  హైదరాబాద్, వరంగల్, చర్లపల్లి, సెంట్రల్ హైదరాబాద్ రెంజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు