ప్రాణం కాపాడిన ‘100’

24 Jul, 2019 10:44 IST|Sakshi
రైలు నుంచి జారిపడిన మణికంఠ

సాక్షి, సంగెం(వరంగల్‌) : రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లిలో ఉపవాస ప్రార్ధనలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సామర్లకోటకు చెందిన మణికంఠ తన భార్య రూపతో కలిసి సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, మణికంఠ అర్థరాత్రి ప్రమాదవశాస్తు రైలు నుంచి జారిపడిపోయాడు. విజయవాడ వరకు రైలు ఎక్కడ ఆగదు. దీంతో ఆయన భార్య రూప వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి జరిగిన విషయం తెలియజేసింది.

ఎక్కడ పడిపోయాడో తెలియకపోవడంతో సంగెం, గీసుకొండ, నెక్కొండ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. సంగెం పెట్రోలింగ్‌ సిబ్బంది జగదీష్‌కుమార్, కుమారస్వామి, రైల్వే సిబ్బంది సహకారంతో చింతలపల్లి ఎల్గూర్‌స్టేషన్ల మధ్య వెదికారు. రెండు గంటల పాటు శ్రమించి ఎల్గూర్‌రంగంపేట రైల్వే గేటుకు కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడిన ఉన్న మణికంఠను గుర్తించి 108కు సమాచారం అందించారు. స్ట్రేచర్‌పై ప్రధాన రహదారివరకు మోసుకుని వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మణికంఠ భార్య రూపకు సమాచారం అందించడంతో ఆమె ఎంజీఎంకు చేరుకుంది. సరౖఝెన సమయంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల నిండు ప్రాణం కాపాడిన సంగెం కానిస్టేబుళ్లు జగదీష్, కుమారస్వామిలను ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు, మామునూర్‌ ఏసీపీ శ్యాంసుందర్‌ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు కాల్‌చేసి పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రవిందర్‌ కోరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జయం మాదే అంటున్న స్థానిక నేతలు !

చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

కలెక్టర్‌ కట్టె పట్టినా అంతే!

తల్లిని చంపాడని తండ్రిని చంపాడు!

పట్టా.. పరేషాన్‌

రైతుల పడరాని పాట్లు..

రెఫర్‌ చేయడం తగ్గించండి 

మా ఊళ్లో మద్యం వద్దు !

మానని గాయానికి ఐదేళ్లు...

క్యాన్సర్‌ సోకిందని కన్న తండ్రిని..

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్‌ చేసిన తల్లి

చెల్లీ.. నేనున్నా!

పైసలియ్యకపోతే పనికాదా..?

మా టీచర్‌ మాకే కావాలి.. 

మిర్యాలగూడలో విషాదం..!

ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్‌చల్‌ 

కేటీఆర్‌ ఇన్‌ రూబిక్స్‌ క్యూబ్‌ 

ట‘మోత’ తగ్గట్లే

అడవి నవ్వింది!

ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్‌

కొత్త సచివాలయానికి 8 నమూనాలు

పొత్తుల్లేవ్‌... సర్దుబాట్లే

కాళేశ్వరానికి పోటెత్తిన వరద

రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు.. 

ఫస్ట్‌ ప్రైవేటుకా? 

ఒకవైపు ధూళి.. మరోవైపు పొగ..

నాసిగా.. ‘నర్సింగ్‌’

నిజాయతీ ఇంకొంచెం పెరగాలోయ్‌!

ఆ క్లాజు వద్దు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌