విభిన్న బైక్‌లు.. విశిష్ట హంగులు

14 Dec, 2018 09:32 IST|Sakshi

ఆధునిక హంగులతో ఆకట్టుకుంటున్న మోటార్‌సైకిళ్లు  

హైదరాబాద్‌ విపణిలోకి వివిధ విదేశీ మోడళ్లు  

రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్న నగర యువత  

ఒక్కోటి రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షలకుపైనే..  

అతివేగం, విపరీత విన్యాసాలు ప్రమాద హేతువులు  

లగ్జరీ కోసమే వినియోగించాలని నిపుణుల సూచనలు

మాదాపూర్‌: యూత్‌ అంటేనే దూకుడు. ఆపై బైక్‌ ఉంటే దానికి కళ్లెమే ఉండదు. కిక్‌ కొడితే చాలు కిక్కెక్కించే సూపర్‌ మోడళ్లు ఇటీవల హైదరాబాద్‌ నగర విపణిలోకిఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. పలు ఇంటర్నేషనల్‌ సూపర్‌ బైక్‌లు అదరగొడుతున్నాయి. లెజెండరీ ఎంవీ అగస్టా నుంచి సూపర్‌ స్పోర్ట్స్, స్ట్రీట్‌ నెకెడ్, నార్టన్‌ మోటార్‌ సైకిల్స్, క్లాసిక్స్‌ బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ ఎస్‌డబ్ల్యూఎం నుంచి ఆన్‌ రోడ్, ఆఫ్‌ రోడ్‌ చార్మింగ్‌ ఎఫ్‌బీ మోండియల్‌ నుంచి హిప్‌స్టార్స్, హ్యోసంగ్‌ నుంచి క్రూయిజర్లు, స్పోర్ట్స్‌ బైక్‌లు యూత్‌నుఆకట్టుకుంటున్నాయి. బైక్‌లను ఇష్టపడే ఔత్సాహికులకు కావాల్సిన అన్ని రకాల వాహనాలు రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మల్టీబ్రాండ్‌ సూపర్‌ బైక్‌ల తయారీదారు కైనటిక్‌ తన మోటో రాయల్‌ను తీసుకొచ్చింది. దీంతో నగరంలోని యువతరయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. కాగా..అతి వేగం, ప్రమాదకర విన్యాసాలు ముప్పు అనేవిషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరముంది. కేవలం లగ్జరీ, అందం కోసమే వీటిని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.  

హెచ్‌పీఎస్‌ 300..
శక్తిమంతమైన సింగిల్‌ సిలిండర్‌ 250 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌
147 కిలోల బరువుతో, గాలితో పోటీ పడుతూ ప్రయాణించే వీలు  
బాస్, ఏబీఎస్‌ మాడ్యులర్‌తో ఫ్రంట్‌ ఫ్లోటింగ్‌ డిస్క్‌ బ్రేక్‌  
త్రోటరీ ఎగ్జాస్ట్‌ నోట్‌తో పూర్తిగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డబుల్‌ బ్యారెల్‌ ఎగ్జాస్ట్‌  
డ్యూయల్‌  టోన్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌తో విలక్షణ, అందమైన హిప్‌స్టర్‌ డిజైన్‌    

నార్టన్‌ డామినేటర్‌..
నార్టన్‌ డామినేటర్‌ రెండు సిలిండర్ల సూపర్‌ బైక్‌.
961 సీసీ ఇంజిన్‌ పరిమాణం, గరిష్ట టార్కు 67ఎన్‌ఎం, 70.94బీహెచ్‌పీ.  

హ్యోసంగ్‌..
కొరియాకు చెందిన అతి పెద్ద మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌.  
క్రూయిజర్లు, 250సీసీ స్పోర్ట్స్‌ బైక్‌ల తయారీలో ప్రత్యేకత  
హ్యోసంగ్‌కు దేశంలో దీనిని 7 వేల మంది వినియోగిస్తున్నారు  
మరింత విస్తరించేందుకు మోటో రాయల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది  

ఎక్విలా ప్రో 650..
ఎక్విలా ప్రో 650 ఎక్విలా సిరీస్‌లో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైంది  
ఇది 647 సీసీ, 8 వాల్వుల ఇంజిన్‌ 73 బీహెచ్‌సీ, 62 ఎన్‌ఎమ్‌ టార్కు  
ఇది బెల్డ్‌తో నడుస్తుంది. ఫై స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ కలిగి ఉంటుంది.  
క్రూయిజర్‌ను పెరిమీటర్‌ ట్యూబ్యులార్‌ స్టీల్‌ క్రాడెల్‌పై నిర్మించారు. ఆఫ్‌ సైడ్‌ డౌన్స్‌ టెలిస్కోపిక్‌ ఫ్రండ్‌ సస్పెస్షన్, హైడ్రాలిక్‌ డబుల్‌ షాక్‌ అబ్జర్వర్లు వెనక వైపు ఉండేలా రూపొందించారు  

ఎస్‌డబ్ల్యూఎం..
ఎస్‌డబ్ల్యూఎం సిరోని వెర్గానీ వెర్మకేట్‌ మిలానోకి సంక్షిప్త రూపం. ఇటాలియన్‌ బ్రాండ్‌కు చెందిన స్పీడీ వర్కింగ్‌ మోటార్స్‌ను 1970లో ఆప్‌ రోడ్‌ విభాగం కోసం ప్రత్యేక ఉత్పత్తిని ప్రారంభించారు. ఎస్‌డబ్ల్యూఎం ప్రస్తుతం మిలాన్‌కో సమీపంలోని వెర్షేలో ఉండగా బీఎండబ్ల్యూ హుస్కురానా పరిశ్రమను సొంతం చేసుకుంది. ఆఫ్‌ రోడ్‌ మోటార్‌ సైకిల్స్‌ విభాగంలో ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా గుర్తింపు పొందింది.  

అతివేగం.. ప్రమాదకరం..  
మార్కెట్‌లోకి వివిధ రకాల సూపర్‌ బైక్స్, స్పోర్ట్స్‌ బైక్స్‌ ఎక్కువ సీసీతో కలిగిన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. యువత సరదా కోసం బైక్‌ రైడ్‌ చేయాలే తప్ప రోడ్లపై మితిమీరిన వేగంతో, విచిత్ర విన్యాసాలు చేయకూడదు.      – మధుసూదన్‌రావు,ఐటీ ఉద్యోగి, బైక్‌ రైడర్‌ 

మరిన్ని వార్తలు