మ.. మ.. మాస్క్‌!

6 Apr, 2020 03:33 IST|Sakshi

కరోనాతో విరివిగా మాస్కుల వాడకంళి సామర్థ్యాన్ని బట్టి మాస్కుల్లో రకాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు నగరాల్లో కాలుష్యాన్ని తట్టుకునేందుకు, డస్ట్‌ ఎలర్జీ ఉన్నవారు, సిమెంట్, ఫార్మా కంపెనీల్లో పని చేసేవారు మాత్రమే మాస్కులు వినియోగించేవారు. కానీ, ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స చేసే వైద్యులు, 24 గంటల పాటు గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, గ్రామం నుంచి పట్టణం దాకా పౌరులందరూ మాస్కులు ధరిస్తున్నారు. ఇందులో అభివృద్ధి చేసిన విధానం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకునే సామర్థ్యాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన వర్సో హెల్త్‌ కేర్‌.కామ్‌ అందించిన వివరాల ప్రకారం.. ఏ మాస్క్‌ దేనిని ఎంత మేర అడ్డుకుంటుందో చూద్దామా..? 

మరిన్ని వార్తలు