పురాతన విగ్రహం కోసం తవ్వకాలు

16 Feb, 2015 13:52 IST|Sakshi

దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూరాతన విగ్రహం కోసం సోమవారం ఉదయం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తాత్కాలిక ఆలయ భూగర్భంలో ఓ పురాతన విగ్రహం ఉండేదని గ్రామస్తుల నమ్మకం. దీంతో అక్కడ తవ్వకాలు జరిపి విగ్రహం బయటపడితే శాశ్వత ఆలయం నిర్మాణం చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తాత్కాలిక ఆలయంలోని స్వామి విగ్రహాన్ని తీసి ఆలయం పక్కనే మరోచోట ప్రతిష్టాపన చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో తవ్వకాలు మొదలయ్యాయి. రాతి విగ్రహానికి సంబంధించిన ఓ భాగం బయటపడింది. తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు