అదే నిజమైతే నితిన్ లాంటి హీరో ...

4 Jul, 2015 09:51 IST|Sakshi
అదే నిజమైతే నితిన్ లాంటి హీరో ...

ఖమ్మం :  సందేశాత్మక చిత్రాలకే తాను ప్రాధన్యమిస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. సాక్షితో ఆయన ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే.. సినిమాలో కథ, ఆ కథకు తగ్గ నటన ఉంటేనే ఆదరణ ఉం టుంది. ‘కేరింత’లో యువతకు జీవితంలో ప్రేమ ఎంత ముఖ్యమో, కెరీర్ అంతే ముఖ్యమ నే సందేశాన్ని ఇచ్చాం.  ఆర్య, కొత్తబంగారులోకం, బొమ్మరిల్లు సినిమాలకు నా డైరీలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి.  పెట్టుబడి ఉంటే సరిపోదని, తగిన కథతో కూడిన సినిమాలను ఎంచుకోవడం అవసరం. తెలుగు ప్రేక్షకుల్లో నాదైన ముద్ర వేసుకున్నాను.
 
 తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సినిమాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే సాయిధరమ్ తేజ హీరోగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విడుదల చేయబోతున్నాం. సునీల్ హీరోగా మరో సినిమా చేస్తున్నాం. స్టార్ డమ్‌గా నిలిచిన డెరైక్టర్లు, నిర్మాతలు, హీరోలుగా నిలిచిన ఎందరో తమ కుమారులు, కుమార్తెలకు సినీరంగంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదు. ఇందుకు లెజెండ్ డెరైక్టర్లు దాసరినారయణరావు, రాఘవేంద్రరావులు నిదర్శనం.
 
 వారు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినా నటనలో రాణించకపోవడంతో కనుమరుగయ్యారు. ఆ ఇద్దరు ైడె రెక్టర్లు కేవలం ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే నటించే సత్తా కావాలని అర్థంచేసుకోవాలి. తెలంగాణలో సినీరంగాన్ని ఎదగనివ్వడంలేదనడం అవాస్తవం. అదే నిజమైతే నితిన్ లాంటి హీరో మనకు పరిచయమై ఉండేవాడు కాదేమో.

మరిన్ని వార్తలు