‘నిరాశాజనకంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌’ 

23 Feb, 2019 03:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లా డుతూ.. ‘రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, అప్పులను కూడా ఆదాయంగా చూపించి మళ్లీ అప్పు లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే బాగుండేది. ఇప్పుడు ఓటాన్‌ అకౌంట్‌లో ఎప్పట్నుంచి నిరుద్యోగ భృతి, రైతుబంధు, ఆసరా పెన్షన్లు పెంచి ఇస్తారో చెప్పలేదు. ఏడాది పా టు పాలన లేకుండా ఉండేందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టారా?..’ అని భట్టి ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు