రైతుకు ఎకరానికి 50 వేలు మిగలాలి

5 Jan, 2018 02:56 IST|Sakshi

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

వ్యవసాయశాఖ క్యాలెండర్‌ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: రైతుకు  ఎకరానికి ఖర్చులు పోనూ రూ.50 వేలు మిగలా లన్నదే ప్రభుత్వ ఆశయమని వ్యవసా యశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అప్పుల్లో కూరుకున్న రైతులను బయటకు తెచ్చి ఆత్మగౌరవంతో బతకడా నికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్, పెట్టుబడిగా ఎకరాకు రూ.8వేలు, కోటి ఎకరాలకు సాగునీరు, నాణ్యమైన విత్తనాల సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయశాఖకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.

సచివాలయంలోని తన చాంబర్‌లో వ్యవసాయశాఖ 2018 క్యాలెండర్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ డైరీ, వ్యవసాయ విస్తరణాధికారుల డైరీ, ఉద్యాన వర్సిటీ క్యాలెండర్లను గురువారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పోచారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగ్గకుండా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

మన విత్తన ధ్రువీకరణ ఏజెన్సీకి మంచి పేరు..
గతేడాది రాష్ట్రంలో 5,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షలాది టన్నుల ధాన్యాన్ని సేకరించామని పోచారం తెలిపారు. తెలంగాణ విత్తన ధ్రువీకరణ ఏజెన్సీకి దేశంలోనే మంచి పేరుందన్నారు. మన రాష్ట్ర ఏజెన్సీని 5 రాష్ట్రాలకు నోడల్‌ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీడ్‌ విలేజ్‌ ప్రోగ్రాంను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు