రుణమాఫీ విధివిధానాలపై చర్చ

24 Jul, 2014 17:36 IST|Sakshi
నాగిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ విధివిధానాలపై ఉన్నత స్థాయి అధికారులు చర్చిస్తున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి నేతృత్వంలో సచివాలయంలో అధికారుల బృందం సమావేశమైంది. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం రుణ మాఫీకి ఏ నిబంధనలు పాటించాలి అనే విషయమై వారు ప్రధానంగా చర్చిస్తున్నారు. వ్యవసాయ రుణాలమాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన 11 మంది సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిని విషయం తెలిసిందే. రుణమాఫీకి  విధివిధానాలను ఈ కమిటీ రూపొందిస్తుంది.

రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇటు కె.చంద్రశేఖర రావు, అటు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఏపిలో  ఆచితూచి అడుగులు వేస్తుంటే, తెలంగాణలో మాత్రం త్వరితగతిన మాఫీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపిలో రీ షెడ్యూల్ అంటుంటే, తెలంగాణలో మాత్రం రుణాలు పూర్తిగా ఎత్తివేసే దిశగా విధివిధానాలు రూపొందిస్తున్నారు.

మరిన్ని వార్తలు