మరోసారి తెరపైకి ‘దిశ’ కేసు

5 Mar, 2020 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య- నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దిశ నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని.. అందులో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యూడిషియల్‌ కమిషన్‌ను కలిసేందుకు వారు హైకోర్టుకు చేరుకున్నారు. పరిహారంపై కమిషన్‌ ముందు ప్రస్తావించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం కమిషన్‌ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్యూడిషియల్‌ కమిషన్‌కు నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్‌ దాఖలు చేశారు.(దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో నేరం జరిగిందా?)

కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో గతేడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్‌, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో... మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసింది. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా