దిశ: మృతదేహాల అప్పగింతపై నేడు విచారణ

20 Dec, 2019 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించి వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించే వ్యవహారంపై శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 6న ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలను కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భద్రపర్చారని, మృతదేహాల కడచూపు కోసం వారి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారని గురువారం హైకోర్టులో న్యాయవాది ప్రస్తావించారు.

దీనిపై పిటిషనర్, ప్రభుత్వ వాదనల నిమిత్తం శుక్రవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఘటనపై హైకోర్టు ప్రస్తుత లేదా రిటైర్డు న్యాయమూర్తితో జ్యుడీషియల్‌ ఎంక్వయిరీకి ఆదేశాలించాలని కోరుతూ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్స్‌ సంఘం సభ్యుడు రాఘవేంద్రప్రసాద్‌ పిల్‌ దాఖలు చేశారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగింత అంశా లపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని రాఘవేంద్రప్రసాద్‌ తరఫున న్యాయవాది మల్లికంటి వెంకన్న ధర్మాసనానికి అందజేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జిల్లాలో కలకలం రేపిన తొలి ‘కరోనా’ కేసు

కరోనా : మద్యం షాపులు బంద్‌ చేయటంతో..

హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి

ఇల్లు సైతం ‘లాక్‌’ డౌన్‌

పొలికెపాడులో కరోనా పరీక్షలు

సినిమా

కరోనా: పాట పాడిన చిరంజీవి, నాగ్‌

క్వారంటైన్‌ లైఫ్‌.. చేతికొచ్చిన పంట మాదిరి..

వైరల్‌: మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన ఆర్‌జీవీ!

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను