దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం

21 Dec, 2019 14:08 IST|Sakshi

23లోగా రీ పోస్ట్‌మార్టం పూర్తి చేయాలి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ : దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాలుగు మృతదేహాల అప్పగింతపై శనివారం న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కోర్టు పలు సూచనలు చేసింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 

అంతేకాకుండా పోస్ట్‌మార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని, కలెక్షన్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరచాలని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని నిపుణులతో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు, బుల్లెట్స్‌, గన్స్‌, ఫోరెన్సిక్‌, పోస్ట్‌మార్టం రిపోర్టులను భద్రపరచాలని, రీ పోస్ట్‌మార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని పేర్కొంది.

కాగా న్యాయస్థానం ఆదేశాలతో  గాంధీ సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ ఇవాళ విచారణకు హాజరు అయ్యారు. మృతదేహాలు యాభై శాతం కుళ్లిపోయాయని, ఫ్రీజర్‌లో ఉంచినప్పటికీ మరో వారం, పదిరోజుల్లో అవి పూర్తిగా కుళ్లిపోతాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 

చదవండి:

సంచలన విషయాలు: దిశ హత్యకు ముందు 9 హత్యలు

దిశ కేసు: దారి మూసివేత

దిశ: మృతదేహాలను ఏం చేయాలి?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా