పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం

6 Dec, 2019 09:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ స్థానికులు వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు ఉన్న తండ్రులుగా...నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడమే సరైన చర్య అని అభిప్రాయపడ్డారు.

దిశ నిందితులు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన వార్త తెలియడంతో సంఘటనా స్థలానికి స్థానికులు తండోపతండాలుగా చేరుకున్నారు. తెలంగాణ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడంతో  44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌ అయింది. స్థానికుల్ని నియంత్రించడం ఓ దశలో పోలీసులకు సమస్యగా మారింది. ఇక హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్‌కౌంటర్‌ను పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. పలుచోట్ల సంబరాలు జరుపుకుని, స్వీట్లు పంచుకుంటు తమ హర్షం వ్యక‍్తం చేస్తున్నారు. 

కాగా దిశ అత్యాచారం, హత్యకేసును దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహారించిన ఆ నలుగురు మృగాళ్లకు భూమ్మీద బతికే హక్కు లేదని జనం నినదించారు. మృగాళ్ల హేయమైన చర్యకు బలైపోయిన దిశకు న్యాయం జరగాలంటే ఆ నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా ఎంపీలే ఈ నినాదాలు చేయడం.. ఘటన తీవ్రతకు అద్దం పట్టింది. దీంతో అన్ని వైపులా నుండి పోలీసులపై ఒత్తిడి పెరిగింది. 

ఈ క్రమంలోనే నిందితులను సీన్‌ రీకనస్ట్రక్షన్‌కు తరలించడం..అక్కడ వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులపై మొదట ప్రధాన నిందితుడు ఆరిఫ్ దాడికి యత్నించాడు. అనంతరం అతడికి మిగిలిన నిందితులు జత కలిశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు...కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా ప్రాంతాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు.

చదవండి: 

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

దిశ నిందితుల ఎన్కౌంటర్: బుల్లెట్ దాచుకోవాలని ఉంది

దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు