మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

6 Dec, 2019 08:48 IST|Sakshi

నిందితులకు తగిన శిక్ష పడింది...

సాక్షి, హైదరాబాద్‌ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.  దిశ‌ని కాల్చిన చోటే నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో  తమ బిడ్డకు తగిన న్యాయం జరిగిందని, నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ జరిగిన సమాచారం తెలుసుకుని ... సంఘటనా స్థలానికి  స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ వద్దకు చేరుకున్న స్థానికులు...పోలీసులు జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి మంచి పని చేశారంటూ పోలీసులు, ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాన్నే పోలీసులు అమలు చేశారని అభిప్రాయపడ్డారు. సీఎం జిందాబాద్‌, పోలీసులు జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

దిశ కేసు వివరాల్లోకి వెళితే....

  • నవంబర్‌ 27న దిశపై అత్యాచారం, హత్య
  • దిశను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులు
  • నవంబర్‌ 28న నిందితులు అరెస్ట్‌
  • నవం‍బర్‌ 29న షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితుల విచారణ
  • నవంబర్‌ 30న నిందితులకు జ్యుడిషియల్‌ కస్టడీ, జైలుకు తరలింపు
  • డిసెంబర్‌ 4న నిందితులను పోలీస్‌ కస‍్టడీకి ఇచ్చిన షాద్‌ నగర్‌ కోర్టు
  • డిసెంబర్‌ 5న నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
  • నిన్న చర్లపల్లి జైలులో నలుగురు నిందితులను విచారణ చేసిన పోలీసులు
  • శుక్రవారం తెల్లవారుజామున నిందితుల ఎన్‌కౌంటర్‌
  • నిందితులను కస్టడీకి ఇచ్చిన మరుసటి రోజే ఎన్‌కౌంటర్‌
     

    చదవండి:

    దిశ నిందితుల ఎన్కౌంటర్

    దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మరిన్ని వార్తలు