ఓటమి భయంతోనే పింఛన్ల పంపిణీ: డీకే అరుణ

19 Jul, 2019 09:31 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ

నారాయణపేట: మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు ఇవ్వని పింఛన్లను ఇప్పుడు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నేత డీకే అరుణ ఆరోపించారు. గురువారం రాష్ట్ర బీజేపీ నేతలు శాంతికుమార్, రతంగ్‌పాండురెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆమె  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీలలో వార్డుల విభజన, ఓటర్ల గణన తదితర విషయాల్లో తప్పుడు తడకలు ఉన్నా ఎన్నికలకు పోవడం సరికాదని, పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో నిర్వహించరాదని కోర్టు కెళితే స్టే వచ్చిన దాఖాలాలు ఉన్నాయన్నారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉత్తర తెలంగాణలో కేసీఆర్‌ కుమార్తె నిజామాబాద్‌ నుంచి కవిత, విశ్వాస పాత్రుడు వినోద్‌ కరీంనగర్‌ ఎంపీ స్థానాల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ పతనం అరంభమైందన్నారు. ఏక పక్ష నిర్ణయాలతో మున్సిపాలిటీల నూతన చట్టాన్ని తీసుకువస్తున్నరన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చేప్పేందుకు సిద్ధంగా ఉన్నరన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోగా తెలంగాణకు బుల్లెట్‌ రైలు కావాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్‌ చేస్తూ ట్విట్టర్‌ పిట్టగా మారాడని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్యయాదవ్, నందునామాజీ, ప్రభాకర్‌వర్ధన్, లక్ష్మిశ్యాంసుందర్, బోయలక్ష్మణ్, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు