జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయింపు

13 Jun, 2014 23:36 IST|Sakshi
జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయింపు

సంగారెడ్డి డివిజన్: మెదక్ జిల్లాకు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సిరీస్‌ను కేటాయించింది. మెదక్ జిల్లాకు ఏపీ 23 స్థానంలో టీఎస్ 15 సిరీస్‌ను రవాణాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు గురువారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. గత కొన్ని రోజులుగా మెద క్ జిల్లా వాస్తులు, వాహనదారులు జిల్లాకు ఏ కోడ్ వ స్తుందోనని ఎదరుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల కు సమాధానం దొరికింది. ఇకపై నూతన వాహనాల రిజిస్ట్రేషన్ జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో ప్రారంభం కా నున్నాయి. సోమవారం నుంచి కొత్త సిరీస్‌తో వాహనా ల రిజిష్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2వతేదీ నుంచి జిల్లాలో తాత్కాలికంగా వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాకు కొత్త  సిరీస్ కేటాయించాల్సి ఉన్నందున రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతాయి. రవాణాశాఖ  సంగారె డ్డి, సిద్దిపేట, పటాన్‌చెరులలో వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తుంది. గత రెండు వారాలుగా జిల్లాలో సుమారు వెయ్యికిపైగా వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయించటంతో వాహనదారుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
 
 రెండు రోజుల్లో జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో కొత్త వాహనాల  రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులతోపాటు పాత వాహనదారులు సైతం రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏపీ 23 స్థానే పాత వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ 15 రిజిస్ట్రేషన్ సిరీస్ చేర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహారణకు జిల్లాకు చెందిన వాహనం ఏపీ 23 ఎఫ్ 5544 ఉంటే కొత్తగా వాహనం నెంబరు టీఎస్ 15 ఎఫ్ 5544 గా ఉంటుంది. సిరీస్ మారనున్న నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు నామమాత్ర ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
 
 పాత వామనదారులు రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చుకోవటంపై అధికారులు రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం డబ్బులు జమచేసిన వారికి టీఎస్ 15 సిరీస్‌తోనే ఫ్యాన్సీ నెంబరు కేటాయించవచ్చని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్సీ నెంబరు కోసం డబ్బులు జమచేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త సీరీస్ పై స్పష్టత రావటంతో అధికారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై అంశంపై దృష్టి సారించనున్నారు.
 

>
మరిన్ని వార్తలు