లెక్కతేలింది..

10 Sep, 2014 02:36 IST|Sakshi
లెక్కతేలింది..

జిల్లా జనాభా  36,18,637  
ఆధార్ కార్డులు లేనివారు 6,90,684
మొత్తం కుటుంబాలు 11,28,118  
సమగ్ర సర్వేలో వెల్లడి 
   
 
 హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. జిల్లా లో మొత్తం కుటుంబా లు, జనాభా లెక్కలపై స్పష్టత వచ్చింది. సర్వే వివరాల ఆధారంగా ప్రస్తుతం జిల్లాలో మొత్తం 36,18,637 జనాభా ఉన్నట్లు తేలింది. వీరిలో మహిళలు 17,72,835, పురుషులు 17,74, 852, మిగిలిన వారిలో ఇతరులు ఉన్నారు. జిల్లాలో  మొత్తం కుటుం బాలు 11,28,118 ఉన్నారుు. 29,27,953 మంది (80 శాతం) ఆధార్‌కార్డులు కలిగి ఉన్నట్లు వివరాలు నమోదు చేసుకున్నారు. మిగతా 6,90,684 మందికి ఆధార్ కార్డులు లేవు.

పెరిగిన కుటుంబాలు 2,42,118

జిల్లాలో 2011 జనాభా గ ణనతో పోలిస్తే ప్రస్తుతం 2,42,118 కుటుంబాలు పెరిగాయి. 2011లో చేపట్టిన జనాభా గణనలో మొత్తం 8.86 లక్షల కుటుంబాలు, 35.12 లక్షల జనాభా ఉంది. ప్రస్తుత సర్వేలో 11,28,118 కుటుంబాలు, 36,18,637 జనాభా ఉన్నట్లు వెల్లడైంది. అంటే 2011 కన్నా 1,06,637 లక్షల జనాభా పెరిగింది.

తాడ్వాయిలో తక్కువ కుటుంబాలు..

 ప్రస్తుత లెక్కల ప్రకారం తాడ్వాయి మండలం 7,116 కుటుంబాలతో జిల్లాలో చివరి స్థానంలో ఉంది. మహబూబాబాద్ మండలం 35,839 కుటుంబాలతో ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో డేటా ఎంట్రీ కార్యక్రమం సోమవారం సాయంత్రం పూర్తయినట్లు జిల్లా సమాచార అధికారి (డీఐఓ) విజయ్‌కుమార్ తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు