జిల్లావ్యాప్తంగా షీ టీంలు

16 Mar, 2016 02:33 IST|Sakshi

* ప్రజల నుంచి షీ టీంకు మంచి ఆదరణ
* జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్

మహబూబ్‌నగర్ క్రైం : మహిళల కోసం ఉన్న ప్రత్యేక చట్టాలలో ఉన్న ఫీచర్స్ తీసుకోని వాటిని తెలుగులో అనువాదం చేసి షీ టీం పోస్టర్లు తయారు చేశామని, ఇలాంటి పోస్టర్ల వల్ల మహిళలకు ఉపయోగం ఉంటుం దని జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్ అన్నా రు. షీ టీంలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం షీ టీం పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లా లో షీ టీంకు మంచి ఆదరణ వస్తుందని అన్నారు. పనితీరు బాగున్నందు వల్లే జిల్లాలో విసృ్తతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలపారు.

మహిళ రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు మరింత ముందుకు తీసుకువెళ్లడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక షీ టీం పని చేస్తోందని, అవసరమైన ముఖ్య పట్టణాల్లో త్వరలోనే షీ టీంలు ప్రారంభిస్తామని తెలిపారు. జనం రద్దీ గా ఉండే కళాశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో సీఐలు సీత య్య, రామకృష్ణ, సైదయ్య, ఎస్‌ఐ జీతేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
చలివేంద్రం ప్రారంభం
నిత్యం రద్దీగా ఉంటే వన్‌టౌన్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం, చాలా ఉపయోగకరంగా ఉంటుం దని జిల్లా ఎస్పీ పి. విశ్వప్రసాద్ అన్నారు. వన్‌టౌన్ సీఐ సీతయ్య ఆధ్వర్యంలో మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గ్లా సులో నీళ్లుపోసి పలువురికి అందించారు. చలి వేంద్రాలు ఎంతోమంది దాహం తీరుస్తాయని అన్నారు. దాతలు సహకరిస్తే పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పా టు చేస్తామని చెప్పారు.
 
మహిళ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ
జిల్లా కేంద్రంలోని మహిళ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్ తనిఖీ చేశారు. సీఐ గది, రికార్డు గది, లాకప్‌లను, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను, సౌకర్యాలను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ద్విచక్ర వాహనాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ సెంటర్‌కు వస్తున్న బాధితుల వివరాలు నమోదు రిజిస్టర్ గురించి అడిగినప్పుడు సిబ్బంది ఇబ్బందిపడ్డారు. దీంతో ఎస్పీ స్పందిస్తూ రికార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అన్ని రకాల రిజిస్టర్‌లు తప్పకుండా మెయింటెన్ చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు