ఆసరా పింఛన్ల అర్హులను గుర్తించాలి

18 Dec, 2018 09:10 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి

ఈ నెల 19న బతుకమ్మ చీరల పంపిణీ

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

ఆదిలాబాద్‌అర్బన్‌: అర్హులైన ఆసరా పింఛన్‌ లబ్ధిదారులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 18న క్రిస్మస్‌ గిఫ్ట్‌ పంపిణీ, 20న ఫుడ్‌ మెటీరియల్‌ పంపిణీ చేయాలని అన్నారు. ఈ నెల 19న బతుకమ్మ చీరలను అర్హులైన పేద మహిళలకు పంపిణీ చేయాలని, జిల్లా స్థా«యి గోదాముల్లో ఉన్న చీరలను గ్రామ స్థాయికి సరఫరా చేయాలని చెప్పారు. పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జూనియర్‌ గ్రామ కార్యదర్శుల నియామకానికి ఈ నెల 25లోగా నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలని, అర్హత సాధించిన వారి హాల్‌టికెట్లను స్థానిక దినపత్రికల ద్వారా పబ్లిష్‌ చేయాలని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని చెప్పారు.

జాతీయ రహదారుల పనులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని, రాష్ట్రంలో 16 జిల్లాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో 90 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 57 సంవత్సరాలు నిండిన అర్హత గల పేద వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో 57 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ల జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి సమాచారాన్ని పంపించాలని తెలిపారు. అర్హత గల వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9355 మంది జూనియర్‌ పంచాయతీ గ్రామ కార్యదర్శుల ని యామకానికి సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా పంపించనున్నట్లు వివరించారు. ఆయా జిల్లాలో పత్రికల్లో హాల్‌టికెట్లను ప్రచురించి అ భ్యుర్థులకు తెలియజేయాలన్నారు. ప్రతీ కుటుం బంలో ఒకరికి పింఛన్‌ అందేలా చూడాలని అన్నా రు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. ఆసరా పింఛన్‌లో భాగంగా ఆధార్‌ను వయస్సు ధ్రువీకరణలో సమస్యలు ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి కుటుంబంలో 75 ఎకరాల భూమి ఉందని, వారికి ఆసరా పింఛన్‌ మంజూరులో సమ స్య ఎదురవుతున్నాయని తెలిపారు.  అభయహస్తం పింఛన్లు సమస్య వివరించారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో సహాయ కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్, డీపీవో, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు