దీపావళికి ప్రత్యేక రైళ్లు

23 Oct, 2014 04:11 IST|Sakshi
దీపావళికి ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాద్ - సిర్పూర్‌కాగజ్‌నగర్, భువనేశ్వర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్ - అహ్మదాబాద్, తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతారు.
     
సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ (07035)స్పెషల్ ట్రైన్ ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (07036) స్పెషల్ ట్రైన్  25వ తేదీ సాయంత్రం 7 గంటలకు సిర్పూర్‌కాగజ్‌నగర్ నుంచి బయలుదేరి రాత్రి 2 గంటల సమయంలో సికింద్రాబాద్ చేరుకుంటుంది.
     
సికింద్రాబాద్-అహ్మదాబాద్ (07018/07017) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1వ తేదీ ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి  బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15కి అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
     
యశ్వంత్‌పూర్-శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రా స్టేషన్ (02679/02680) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1, 8 తేదీలలో (శనివారం) ఉదయం 11.30 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి 4.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సోమవారం రాత్రి 7.45 గంటలకు వైష్ణోదేవి కాత్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 4, 11 తేదీలలో (మంగళవారం) ఉదయం 5.15 గంటలకు వైష్ణోదేవి కాత్రా నుంచి బయలుదేరి బుధవారం సాయంత్రం 7.25 గంట లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరి గి 7.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌కు ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ఐఆర్ సీటీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
 
ఆర్‌ఆర్‌సీ ఎగ్జామ్స్‌కు ప్రత్యేక రైళ్లు...
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఎగ్జామ్స్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వీక్లీ స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్-సికింద్రాబాద్ వీక్లీ (08403/08404) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీలలో రాత్రి 10.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
 
అదనపు బోగీలు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు తెలిపారు. ఒక ఏసీ చైర్‌కార్, 2 సెకెండ్‌క్లాస్ చైర్‌కార్ బోగీలు  ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఈ నెల 31 వరకు 720 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు