విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలి

17 Sep, 2019 09:48 IST|Sakshi
మాట్లాడుతున్న డీకే అరుణ

మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు  

మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ

ఖమ్మంమామిళ్లగూడెం: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన కేసీఆర్‌ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వద్దని వ్యతిరేకించిన ఎంఐఎం మిత్రుల కోసం నిర్వహిం చడం లేదా?.. ఈ అంశంపై తెలంగాణ ప్రజల కు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరవీరుల చరిత్ర మరుగున పడటానికి చేయడం లేదని ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఎక్కడ అని, ఇళ్లు లేని వారిని ఎంత మందిని గుర్తించారని, 50 ఏళ్లు దాటిన వారికి కొత్త పింఛన్లు, రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో దోచుకొని జేబులు నింపుకున్నారని మండిపడ్డారు.

అవినీతిపై కటకటాలు తప్పవని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలన నుంచి వీరోచితంగా పోరాడిన జమలాపురం కేశవరావు, చాకలి ఐలమ్మ తదితరులను పక్కన పెట్టారని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకొని పనిచేస్తున్నారని ఆరోపించారు. విమోచజన దినోత్సవాన్ని కర్ణాటక, మహారాష్ట్రల్లోలాగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు పెరిగి పోయా యని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు గెంటెల విద్యాసాగర్, దిద్దుకూరి వెంకటేశ్వర్లు, దొంగల సత్యనారాయణ, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, పుల్లయ్య, వీరస్వామి, రుద్రప్రదీప్, రామలింగేశ్వరరావు, సరస్వతి, మందనపు    రా మారావు, వాసుదేవరావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు