‘కూటమి సీఎం వారే నిర్ణయిస్తారు’

1 Dec, 2018 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోను హంగ్‌ ఏర్పడదని.. మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ప్రత్యేక వ్యూహంతో​ అన్ని పక్షాలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి గెలుపుదిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, కానీ వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

కూటమి ప్రభుత్వంలో టీడీపీ, ఇతర పార్టీల పాత్ర ఎలా ఉంటుందనేది రాహుల్‌ గాంధీ, చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్నది హైకమండ్‌ ప్రకటిస్తుందని తెలిపారు. కాగా రాజకీయ వ్యూహలు రచించడంలో దిట్టగా పేరొందిన శివకుమార్‌ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు ఇక్కడే ఉంటూ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.

మరిన్ని వార్తలు