'విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవు'

12 Nov, 2014 20:45 IST|Sakshi
'విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవు'

హైదరాబాద్: రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్ల (జూడాలు) పై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. రేపటిలోగా విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవని జూడాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పి.శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 75 శాతం హాజరు లేకుంటే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. 

గ్రామీణ ప్రాంతంలో పని చేసే జూడాలకు కాలపరిమితిని రెండేళ్లకు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పని చేసే   నిబంధన ఇతర రాష్ట్రాలలో కూడా ఉందని  పి.శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.    
 

మరిన్ని వార్తలు