పంచాయతీ లేఅవుట్లను అనుమతించం

27 Nov, 2014 22:59 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: లేఅవుట్ల అనుమతి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. డీటీసీపీ (డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) లేదా హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతి తీసుకున్న తర్వాతే ప్లాట్లు విక్రయించుకునే అధికారం ఉం టుంది. కానీ జిల్లాలో, ముఖ్యంగా నగర శివారు పంచాయతీల పరిధిలో ఏకంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, పాలకమండలి ఆమోదంతో వేల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. వీటిలో ప్లాట్ల విక్రయాలు పూర్తైభవన నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం వీటిపై చర్యలు తీసుకోవడం అంత సులువైన విషయం కాదు.

 500 లేఅవుట్లు తొలగింపు...
 ఇటీవల పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నగర శివారు గ్రామాల్లో ర్యాండమ్‌గా సర్వే నిర్వహించి దాదాపు ఐదువందలకుపైగా అక్రమ లేఅవుట్లు గుర్తించాం. అలా గుర్తించిన చాలా లేఅవుట్లలో నిర్మాణాలు లేవు. దీంతో వాటిని ట్రాక్టర్లతో చదును చేయించాం. ప్లాట్లుగా గుర్తించే హద్దురాళ్లను తొలగించాం. ఎల్‌ఆర్‌ఎస్ ఉంటే అనుమతిస్తున్నాం. లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గతనెలలో ఇబ్రహీంపట్నం మండలం ఆది బట్ల, బొంగ్లూర్ గ్రామ పంచాయతీల పరిధిలో లేఅవుట్లను తొలగిస్తే వెంటనే సదరు యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ చేయి ంచుకుని అనుమతి తీసుకున్నారు. ఇలా అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టాం.
 
రిజిస్ట్రేషన్లు.. బ్యాంకు రుణం కట్..

 అక్రమంగా వెలిసిన లేఅవుట్ల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన విజిలెన్స్ బృందం ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక ఇచ్చింది. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతిలేని లేఅవుట్లకు సంబంధించి వెంటనే రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆ నివేదిక లో పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ అనుమతితో పంచాయతీశాఖ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాస్తున్నాం. దాంతో అ క్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలి చిపోతాయి. అదేవిధంగా నిర్మాణాలపై రుణా లు ఇవ్వొద్దంటూ బ్యాంకర్లకు సైతం లేఖ రాస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తిచేయడానికి కొంత సమయం పడుతుంది.

 పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్
 గ్రామపంచాయతీలకు రాబడి పెంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాం. ఆస్తి పన్ను వసుళ్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలాచోట్ల నిర్మాణాల అసిస్మెంట్ సరిగా జరగలేదు. దీంతో అసిస్మెంట్ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. గతంలో ఆస్తి పన్ను రూ.89కోట్లు లక్ష్యం కాగా.. మదింపు అనంతరం దాదాపు రూ.150కోట్లకు చేరనుంది. ప్రస్తుతం పింఛన్లు, ఆహార భద్రత పరిశీలపై ఈఓపీఆర్‌డీలు బిజీగా ఉన్నారు. డిసెంబర్ రెండో వారంలోపు ఈ ప్రక్రి య పూర్తవుతుంది.
 డిసెంబర్ చివరి వారం నాటికి ఆస్తి పన్నుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాం. అదేవిధంగా ట్రేడ్‌లెసైన్స్ వసూళ్లపైనా చర్యలు చేపట్టాం.

 ఆరోపణలు రుజువైతే చర్యలు..
 జిల్లాలో 688 పంచాయతీలకుగాను 676 గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పాటై ఏడాది అవుతోంది. అయితే గత నెలరోజుల నుంచి సర్పంచులపై ప్రజావాణికి ఫిర్యాదులు వస్తున్నాయి. నిధుల వినియోగంలో అక్రమాలు తదితర అంశాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 15మంది సర్పంచులు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించాం. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు