ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..

23 Jul, 2019 07:27 IST|Sakshi

ఐటీడీఏ పీఓ గౌతమ్‌

భద్రాచలంటౌన్‌: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో నిర్వహించే గిరిజన దర్భార్‌లో ఉద్యోగాలు కావాలని అర్జీలు పెట్టుకోవద్దని ఐటీడీఏ పీఓ వీపీ.గౌతమ్‌ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్భార్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తన పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తూ, మిగిలిన వాటిని సంబంధిత యూనిట్‌ అధికారులకు అందజేశారు. ఎక్కువశాతంమంది పోడు భూముల పట్టాలివ్వాలని, స్వయం ఉపాధి పథకాల రుణాలు మంజూరు చేయాలని, పోడు సాగు చేసుకుంటున్నామని అటవీ, పోలీసు అధికారులు దాడులు చేసి అక్రమంగా కేసులు పెడుతున్నారని విన్నవించారు. బయ్యారానికి చెందిన గిరిజన రైతుల అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వడం కుదరదని తహసీల్దార్‌ ఇబ్బంది పెడుతున్నారని తెలపగా..ఐటీడీఏ పీఓ స్పందించి సంబంధిత అధికారికి ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంకా పలు సమస్యలపై అర్జీలు పరిశీలనకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ కోటిరెడ్డి, ఎస్వో సురేష్‌బాబు, ఏఓ భీం, మేనేజర్‌ సురేందర్, ఏపీఓ పవర్‌ అనురాధ, ఏడీ అగ్రికల్చర్‌ సుజాత, ఎల్టీఆర్‌ డీటీ సులోచన, ఇంజనీరింగ్‌ విభాగం నాగభూషణం, ఎంప్లాయ్‌మెంట్‌ విభాగం మెరుగు సంధ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు