ఉపాధి పనుల్లో తప్పులు చేస్తే చర్యలు

21 Jul, 2018 13:15 IST|Sakshi
ప్రజా వేదికలో మాట్లాడుతున్న ఏపీడీ సాయన్న  

పిట్లం(జుక్కల్‌) నిజామాబాద్‌ : ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న సిబ్బంది తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీడీ సాయన్న హెచ్చరించారు. శుక్రవారం నాడు పిట్లం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉపాధిహామి సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరై మాట్లాడారు. మండలంలో 2017–18 సంవత్సరానికి రూ.5.70 లక్షల పనులు జరగాయన్నారు. వీటికి సంబంధించి మండలంలోని గ్రామాల్లో వారం రోజులపాటు సామాజిక తనిఖీ చేశామన్నారు.

గతంలో మండలంలో రూ.9 కోట్ల వరకు పనులు జరిగితే ఈసారి తక్కవగా జరగాయని, రానున్న రోజుల్లో ఇలా జరిగితే సహించేది లేదని, పని దినాలను పెంచాలన్నారు. ఈసారి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.61 లక్షల పని దినాలను కల్పించామన్నారు. ఉపాధి పనులు తక్కవగా జరిగితే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, ఈ వర్షకాలం కాగానే పనులు జోరుగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక సామాజికి తనిఖీ బృందం వారు గ్రామాల్లో చేసిన ఆడిట్‌ నివేదికను చదివి వినిపించారు.

అయితే సిబ్బంది చిన్న చిన్న తప్పులకు పాల్పడినట్లు తెలిసిందని, ఇటువంటి వాటిని మానుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ ప్రతాప్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ నర్సాగౌడ్, డీవీవో భూమేశ్వర్, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, నిజాంసాగర్‌ ఎంపీడీవో పర్బన్న, ఎస్‌ఆర్‌పీ రంజిత్‌ కుమార్, ఏపీవోలు శివ కుమార్, టీఏలు బల్‌రాం, హకీం, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు