రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

16 May, 2018 13:20 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్వేతామహంతి

మదనాపురం : మండలంలోని అజ్జకొల్లులో మంగళవారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ శ్వేతామహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ వివరాలను తహసీల్దార్‌ సింధూజను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని, ప్రతి రైతుకు చెక్కును అందజేస్తామని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశమని వివరించారు.

అనంతరం ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించారు. అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, ఆర్‌ఐ ఎండీ గౌస్, వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, రైతు కోఆర్డినేటర్‌ రాములుగౌడ్, మహిళాసంఘాల లీడర్లు పాల్గొన్నారు. 

పనులు వేగవంతం చేయాలి 

వనపర్తి : వీపనగండ్ల మండలం తూంకుంటలో ఏర్పాటు చేయనున్న పాలశీతలీకరణ కేంద్రం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్వేతామహంతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో జిల్లా పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్, డీఆర్‌డీఓ గణేష్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు కోసం గుర్తించిన భవనంలో విద్యుత్, నీటివసతి, డ్రెయినేజీ,  పాలమిత్ర సొసైటీల ఏర్పాటు విషయంపై కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు.

పాలశీతలీకరణ కేంద్రానికి రోజూ వచ్చే పాలు కేంద్రం నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, పాలసేకరణ కోసం వినియోగించే వాహనాలు, రాబడి తదితర అంశాలను కలెక్టర్‌ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. తూంకుంట సమీప గ్రామాల నుంచి పాలకేంద్రానికి ఎక్కువగా వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పాలలభ్యత తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.  

మరిన్ని వార్తలు