వాళ్లంతా మార్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే...

2 Apr, 2020 12:31 IST|Sakshi

సాక్షి, నల్గొండ: జిల్లాలో తొలిసారిగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండల్‌ రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండలో అయిదుగురు మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఆయ తెలిపారు. అయితే వీరంతా ఢిల్లీలోని మార్కజ్‌కు వెళ్లిన వారేనని కూడా పేర్కొన్నారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వీరికి ఫీవర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులను ఉదయం జిల్లా కేంద్ర ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించామని, వారి శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌కు పంపించామన్నారు. (క్షణక్షణం.. అప్రమత్తం)

కాగా వారి రిపోర్ట్సు వచ్చాక అవసరమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఇక పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరూ సన్నిహితంగా ఉన్నారో వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇంకా 82 మంది క్వారంటైన్‌లో ఉన్నారని, ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. జిల్లాలో మహమ్మారి విజృంభన రెండో దశలోనే తీవ్రంగా ఉందని, ప్రజలంతా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇక వైద్య సిబ్బంది కూడా తగు జాగ్రత్తలతో విధులు నిర్వర్తించాలని ఆయన చెప్పారు. (నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు)

మరిన్ని వార్తలు