వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

17 Jul, 2018 14:42 IST|Sakshi
ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 

ఏటూరునాగారం వరంగల్‌ : వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశించారు. ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిని ఆయన సోమవారం ఆకస్మిక సందర్శించారు. మొదట ఆస్పత్రిలోకి వెళ్లిన ఆయన ఈసీజీ తీయించుకున్నారు. అనంతరం ఓపీ నమోదు, రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, మందుల కొరత తదితర విషయాలపై ఆరా తీశారు. నిత్యం ఓపీ 500ల నుంచి 800 వరకు నమోదవుతున్నట్లు వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. 

వేతనాలు రావడంలేదు..

తమకు ఐదు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్‌ రాలేదని వచ్చాక ఇస్తామన్నారు. లేదంటే తన నిధుల నుంచి అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని సమ్మక్క తనకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పించాలని, పింఛన్‌ రావడంలేదని చెప్పడంతో ఆమె ఆదార్‌కార్డును పరిశీలించిన కలెక్టర్‌ వయస్సు 65 సంవత్సరాలు ఉంటేనే పింఛన్‌ వస్తుందని చెప్పారు.

డబుల్‌ బెడ్రూం ఇంటి కోసం ప్రపోజల్‌ పెట్టాలని తహసీల్దార్‌ నరేందర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ శంకర్‌రావు, ఏఈఈ మధుకర్, వీఆర్‌ఓలు పాండ్య, రాములు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు