ఎమ్మెల్యే కోనేరు కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి

21 Mar, 2020 08:27 IST|Sakshi
కోనేరు కోనప్ప (ఫైల్‌ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కోరల్లో చిక్కిన అమెరికాలో ఇటీవల పర్యటించి వచ్చిన సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులను క్వారం టైన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు జిల్లా వైద్యా దికారిని ఆదేశించారు. అక్కడికి వెళ్లి వచ్చిన ఆయన క్వారంటైన్‌లో ఉండటం మంచిదని సూచించారు. ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచాల్సిందిగా ఉన్నతాధికారులు స్థానిక డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆసిఫాబాద్‌ డీఎంహెచ్‌వో ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరపున లేఖ కూడా పంపారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. లేఖ ప్రతుల్ని జిల్లా ఎస్పీకి కూడా పంపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. (భయపడొద్దు.. జాగ్రత్తలే మందు).

మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతోపాటు లండన్‌లో చదువుకుంటున్న 18 ఏళ్ల యువతికి కూడా శుక్రవారం కోవిడ్‌ పాజిటివ్‌ తేలింది. దీంతో తెలంగాణలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరినట్లయింది. (ఇండోనేసియా బృందంలో అందరికీ పాజిటివ్‌)

మరిన్ని వార్తలు