పిచ్చికుక్కల స్వైరవిహారం 

6 Apr, 2019 12:33 IST|Sakshi
పిచ్చికుక్కల దాడిలో  గాయపడిన పశువు 

సాక్షి, రెంజల్‌(బోధన్‌): మండలంలోని బాగేపల్లి గ్రా మంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకుటు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది, పన్నెండు రోజులుగా పిచ్చికుక్కలు పశువులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వాటి భయానికి ఇంట్లో నుంచి రాత్రిపూట బ యటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. రా త్రి సమయంలో పశువుల పాకల్లో కట్టెసిన పశువు లపై దాడులు చేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

బర్రెలను తలుగులకు కట్టేసి ఉంచడంతో అవి ఎదురు తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు. గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయిబాబగౌడ్‌కు చెందిన పశువుల పాకలోని రెండు గేదెలపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. శుక్రవారం పశువుల పాకను శుభ్రం చేసేందుకు వెళ్లగా గేదెలు అపస్మారకస్థితిలో ఉన్న ట్లు గుర్తించారు. అప్పటికే ఓ గేదె మృత్యువాత ప డినట్లు గుర్తించారు. ఇప్పటికే అనేక పశువులను పిచ్చికుక్కలు దాడి చేశా యని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బా ధిత రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దించి గ్రామంలో రాత్రిపూట సంచరిస్తున్న పిచ్చి కుక్కలను సంహరించాలని కోరుతున్నారు.   

>
మరిన్ని వార్తలు