తగ్గిన గృహహింస

4 May, 2020 04:11 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గణనీయంగా తగ్గిన వేధింపుల కేసులు

భార్యాపిల్లలతో సఖ్యత, మద్యం దొరక్కపోవడమే కారణమంటున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహహింస కేసులు గణనీయంగా తగ్గాయి. గతంలో రోజుకి గరిష్టంగా 550కిపైగా న మోదయ్యే కేసులు ఏకంగా 5 రె ట్లు పడిపోయి కనిష్టంగా 80–90 మధ్య నమోదవుతున్నాయి. లా క్‌డౌన్‌కు ముందు ప్రతీనెల 10 నుంచి 12 వేల వరకు గృహహింస కేసు లు నమోదయ్యేవి. లాక్‌డౌన్‌ అనంతరం ఈ సంఖ్య 3 వేలకు పడిపోయింది. వాస్తవానికి లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయని సో షల్‌ మీడియాలో ప్రచారం వెల్లువెత్తిం ది. అయితే ఇది వాస్తవం కాదని, పోలీ సు రికార్డులు చెబుతున్నాయి. ఉత్తరాది లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, దక్షిణాదిన తగ్గాయని తెలుస్తోంది.

గృహహింస వివాదాలపై డయల్‌ 100కు వ చ్చే కాల్స్‌లో గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. గృహహింస కేసుల్లో ప్రధానంగా భర్తల కారణంగా వేధిం పులు ఎదుర్కొనే వారే అధికంగా ఉండేవారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంచెం అత్తామామల జోక్యం కని పించేది. ఏదిఏమైనా లాక్‌డౌన్‌తో భార్యాపిల్లలతో రోజూ ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల చాలావరకు కలహా ల కాపురాలు కూడా చక్కబ డుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రతీ ఇం ట్లోనూ గొడవలకు ప్రధాన కారణం తాగుడు. మద్యం పే ద, దిగువ మధ్య తరగతి కు టుంబాల్లో తీరని వ్యథలను మిగులుస్తోంది. ఈ విషయం లో తరచుగా దంపతులు పోట్లాడుకుని ఠాణా మెట్లెక్కేవారు. కానీ, ఇప్పుడు మ ద్యం అందుబాటులో లేకపోవడంతో కే సులు తగ్గాయని, ఇతరత్రా చికాకులు కూడా లేకపోవడంతో అంతా ప్రశాం తంగా ఉన్నారని పోలీసులంటున్నారు.

మార్చి 24తర్వాత అనూహ్యంగా
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ 23 వరకు 35 వేలకుపైగా గృహహింస కేసులు నమోదయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి కేసులు గణనీయంగా పడిపోయాయి. అప్పటివరకు రోజుకు సగటు సరాసరిగా 382 అంతకంటే అధికంగా కేసులు నమోదయ్యేవి. లాక్‌డౌన్‌ తర్వాత కేసులు ఏ రోజూ రెండు వందల అంకెను చేరుకోకపోవడం గమనార్హం. ఏప్రిల్‌లో చాలా రోజులు సగటున 80 – 90 కేసులు మాత్రమే నమోదవడం విశేషం.

ఈ ఏడాది నెలల వారీగా నమోదైన గృహహింస కేసులు
జనవరి: 11,461
ఫిబ్రవరి: 10,875
మార్చి: 10,414
ఏప్రిల్‌: 3,015 
(ఏప్రిల్‌ 23 వరకు) మొత్తం: 35,765

మరిన్ని వార్తలు