అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి: హైకోర్టు 

12 May, 2020 04:35 IST|Sakshi

పోలీసులు, మీడియా, ప్రభుత్వాలకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులతో పాటుగా వారి తల్లిదండ్రులు, కుటుంబీకుల పేర్ల ను, ఇతర వివరాలను విద్యాసంస్థలు, పత్రికలు, టీవీల ద్వారా బహిర్గతం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీ సుకోవాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ విషయం లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలయ్యే లా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆ దేశించింది. అత్యాచార ఆరోపణలపై క్రిమినల్‌ కేసులతోపాటు శాఖాపరమైన దర్యాప్తు జరపవచ్చునని, ఈ రెండూ వేర్వేరని తేల్చి చెప్పింది. హైదరాబాద్‌ నగరంలో ఆటమిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో ప్రిన్సిపాల్‌గా చేసిన కేదార్‌నాథ్‌ మహాపాత్ర 2017 అక్టోబర్‌ 28న 9వ తరగతి చదివే విద్యార్థిని తన గదికి రప్పించుకుని ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు 2017 నవంబర్‌ 24న మహాపాత్రను అరెస్టుచేసి కోర్టు ఆదేశాల తో రిమాండ్‌కు తరలించారు.

బెయిల్‌పై విడుదలైన మహా పాత్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై పోలీ సు కేసు ఉన్నందున శాఖాపరంగా దర్యాప్తు చేయకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు వెలువరించిన తీర్పులో అత్యాచార, లైంగిక వేధిం పుల బాధితుల పేర్లను వెల్లడించరాదని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలయ్యేలా చేయాలని ఆదేశిం చింది. ఈ తరహా కేసులో నమోదు చేసే ఎఫ్‌ఐఆర్, రిమాం డ్‌ రిపోర్ట్, చార్జిషీట్లలో పేర్లను పోలీసులు వెల్లడించకుండా చేయాలని, వీటిని కోర్టులకు సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని ఆదేశించింది. పోలీసులు నమోదు చేసే క్రిమినల్‌ కేసుల కు, శాఖాపరంగా జరిగే దర్యాప్తూ వేరువేరని స్పష్టం చేసిం ది. క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడితే అది సమాజానికి, శాఖాపరమైన దర్యాప్తులో తేలితే అది సంబంధిత యాజమాన్యం –సంస్థకు చెందినది అవుతుందని వివరించింది. తన ముం దున్న కేసులో పిల్లలకు బోధనతోపాటు భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత విద్యాసంస్థపై ఉంటుందన్నారు. 

>
మరిన్ని వార్తలు