ఓటుపై ‘నవనిర్మాణ్‌ ’ కృషి అభినందనీయం

1 Dec, 2018 14:28 IST|Sakshi
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పీవో కృష్ణఆదిత్య  

బోథ్‌: నోటుకు ఓటును అమ్ముకోవద్దంటూ వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన నవ నిర్మాణ్‌ సొసైటీ సభ్యులను బోథ్‌ రిటర్నింగ్‌ అధికారి, పీవో కృష్ణఆదిత్య అభినందించారు. బోథ్‌ మండలంలోని సొనాల గ్రామానికి చెందిన నవనిర్మాణ్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తయారు చేసిన పోస్టర్‌ను శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో పీవో విడుదల చేశారు. యువత ప్రజలను మేల్కొలిపేలా కార్యక్రమాలు నిర్వహించడంపట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ఓటు గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయడానికి తన సంస్థ నిర్ణయం తీసుకుందని, గ్రామాల్లోకి వెళ్లి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామని సొసైటీ అధ్యక్షుడు కోస్మెట్టి శుద్ధోధన్‌ అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కె.మహేశ్వర్, లోకేశ్, రవీందర్, రాజేశ్వర్, సొసైటీ అధ్యక్షుడు కోస్మెట్టి శుద్ధోధన్, ప్రధాన కార్యదర్వి బాశెట్టి రాజ్‌ కుమార్, కోశాధికారి శ్రీరాం విజయ్, సభ్యులు సోమ సురేశ్‌రెడ్డి, రాజశేఖర్, రమణ, శ్రీనివాస్, పోతన్న తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు