డిసెంబర్‌ 31 రాత్రి పోలీసులంతా రోడ్లపైనే..

19 Dec, 2018 17:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతి ఏడాదిలాగే రాత్రి ఒంటిగంట తరువాత న్యూ ఇయర్ వేడులు జరపకూడదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు అన్ని హోటల్స్, పబ్స్ యజమానులకు నియమ నిబంధనలపై ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వేడుకలు జరిపే ప్రతిచోటా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. న్యూ ఇయర్ పార్టీ వేడుకల్లో డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టామన్నారు. 

డిసెంబర్ 31న నగరంలోని ఫ్లైఓవర్‌లు బంద్ చేయనున్నట్టు అంజని కుమార్ పేర్కొన్నారు. ఆరోజు పోలీసులు అందరూ రోడ్లపైనే డ్యూటీలో ఉంటారని చెప్పారు. మైనర్లు మద్యం సేవించినా, అమ్మినా కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం అయిందన్నారు. సీఎస్ ఆదేశాల మేరకు రాష్టప్రతికి భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలందరికి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను అందంగా జరుపుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు