ఎన్నికలెప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు

16 Jul, 2018 10:48 IST|Sakshi
కిషన్‌రెడ్డిని స్వాగతిస్తున్న ఎమ్మెల్యే బాబూమోహన్‌  

రేగోడ్‌(మెదక్‌): రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా శాసనసభ ఎన్నికలు రావొచ్చని మాజీ మంత్రి, అందోల్‌ ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌ స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని గజ్వాడ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనీయర్‌ నాయకుడు కిషన్‌రెడ్డితో పాటు సుమారు 110 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు.

నాయకులు, కార్యకర్తలు, మహిళలకు టీఆర్‌ఎస్‌ కండువా వేసి బాబూమోహన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. సీనీయర్‌ నాయకుడు కిషన్‌రెడ్డి, వట్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్‌ పట్లోళ్ల భూంరెడ్డితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే బాబూమోహన్‌ను ఘనంగా సన్మానించారు. బాబూమోహన్‌ మాట్లాడుతూ ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావొచ్చని అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ కేడర్‌కు సూచించారు. గజ్వాడ గ్రామానికి గతంలో నేను చేసిన అభివృద్ధే ఉందని, ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించుకుందామని తెలిపారు. 

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను తప్పకుండా మంజూరు చేస్తానని బాబూమోహన్‌ హామీ ఇచ్చారు. నాలుగైదు రోజుల్లో కలెక్టర్‌తో మాట్లాడి ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో ఒకే స్థలంలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా స్థలం పరిశీలించాలని సూచించారు. ఎక్కడ మనస్పర్థలు రాకుండా పని చేయాలని కోరారు.

బోరంచ మడుగు నుంచి సాగుకు నీళ్లు 

బోరంచ మడుగు నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు సాగుకు, తాగుకు నీళ్లిస్తానని బాబూ మోహన్‌ విలేఖరుల సమావేశంలో తెలిపారు. తా టిపల్లి గట్టుపైన లిప్ట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదని, ముం దుకు వస్తే వెయ్యి ఇళ్లు ఇవ్వడానికైనా సిద్ధమని తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీపీ మమత, కో అప్షన్‌ సభ్యుడు మొహీజొద్దీన్, వట్‌పల్లి మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్, డైరెక్టర్‌లు పట్లోళ్ల భూంరెడ్డి, సుంకె రమేశ్, పార్టీ యూత్‌ మండల అధ్యక్షుడు సీహెచ్‌.లక్ష్మన్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రాములు, కొత్వాన్‌పల్లి సర్పంచ్‌ రవీందర్, గొర్రెల కాపరుల సంఘం మండల అధ్యక్షుడు రాజుయాదవ్, నాయకులు బాబా, సుభాశ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు