బాధ్యతతోనే భద్రత

13 Jul, 2020 02:34 IST|Sakshi

సామాన్యులైనా.. ప్రముఖులైనా.. కరోనాకు అందరూ సమానమే

వైరస్‌కు ఎలాంటి తారతమ్యాలు లేవు..

జాగ్రత్తలొక్కటే శ్రీరామరక్ష

అందరూ బాధ్యతాయుతంగా ఉంటే కరోనా కట్టడి అసాధ్యమేమీ కాదు

‘సాక్షి’తో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డాక్టర్‌ దశరథరామారెడ్డి తేతలి

సాక్షి, హైదరాబాద్‌: ‘కొన్ని దేశాల ప్రధాని స్థాయి వ్యక్తులు మొదలు వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తుల వరకు అన్ని అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఎవరూ కరోనాకు అతీతులు కాదు. ఇది అందరూ గ్రహించాలి’ అని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు, సోషల్‌ యాక్టివిస్ట్‌ డాక్టర్‌ దశరథరామారెడ్డి తేతలి చెప్పారు. ‘ఈ వైరస్‌కు కులం, మతం, ప్రాంతం, ఆడ–మ గ, ధనిక, పేద అనే తారతమ్యాలు లే వు. ఎవరికైనా వ్యాపించే ప్రమాదముంది. కాబట్టి ఇది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరి కీ సమానమే’నని చెబుతున్న ఆయ న ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న సవాళ్లు, తదితర అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

అంతా మన చేతుల్లోనే ఉంది..
కరోనా కేసులు పెరిగి, వైరస్‌ వ్యా ప్తి పెరిగిన నేపథ్యంలో దీనిని స మర్థవంతంగా అడ్డుకుని, పరిస్థి తి చేదాటకుండా చేసుకోవాలా? లేక మహమ్మారి తీవ్రంగా మారి అందరూ దాని బారినపడే వర కు చేతులు కట్టుక్కుని చూద్దా మా? అనేది అందరూ నిర్ణయించుకోవాలి. ప్రభుత్వాలు, డాక్టర్లు చేయగలిగినంత చేస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్‌ సోకినవారు, లక్షణాలున్న వారు ఏ మాత్రం తాత్సారం చేయకుండా ముందుకొచ్చి టెస్ట్‌లు చేసుకోవాలి. తప్పక మాస్క్‌లు ధరించడం, మనుషు ల మధ్య ఆరడగులదూరం, హ్యాండ్‌ శా నిటైజ్, వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహా రం తీసుకుంటూ ఎలాంటి భయాల్లేకుండా ఆరోగ్యకర జీవితం గడపడం ఒక్కటే శ్రీరామరక్ష. త మకేమీ కాదని ఇష్టానుసారం రోడ్లపైకి రావడం, విచ్చలవిడిగా తిరగడం మానాలి. అన్ని జాగ్రత్త లు తీసుకుంటూ అంద రూ బాధ్యతగా ఉంటే ఈ వైరస్‌ నియంత్రణ సాధ్యమే. 

లాక్‌డౌన్‌ నేర్పిన పాఠాలు
మనకు లాక్‌డౌన్‌ ఎంతో నేర్పింది. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఏ స్థాయి రోగికి ఎలాంటి చికి త్స చేయాలో అర్థం కాక అభివృద్ధి చెందిన దేశా లు సైతం ఇబ్బందిపడ్డాయి. వాటి అనుభవా లు, పరిశోధనలు ఆ తర్వాత మనకు కొంతమేర పనికొచ్చాయి. మనదేశ పరిస్థితులకు తగ్గట్టుగా వివిధ మందులు, చికిత్స విధానాల ను రూపొందించుకుంటున్నాం. ఈ వైరస్‌ స్ట్రెయిన్లు దేశంలో 200 వరకు, హైదరాబాద్‌ లో వందకుపైగా ఉన్నట్టు అం చనా. ప్రస్తుత çసమయంలో ఏం చేయాలనేది ఎంత ముఖ్యమో, ఏం చేయకూడదనేదీ అంతకంటే ముఖ్యమే. అం దరూ సురక్షితులయ్యే వరకు ఎవరూ సురక్షితులు కాదు (నో బడీ ఈజ్‌ సేఫ్‌ అంటిల్‌ ఎవ్రీబడీ ఈజ్‌ సేఫ్‌), అందరినీ గౌరవించండి, అందరినీ అనుమానించండి (రెస్పెక్ట్‌ ఆల్‌ సస్పెక్ట్‌ ఆల్‌) అన్న మాటలను అందరూ గుర్తుపెట్టుకోవాలి.

కరోనా వస్తే కళంకమేమీ కాదు
మొదట్లో వయసు పైబడిన వారు, గుండె, శ్వా సకోశ, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు కరోనా తీవ్రత వల్ల మరణించారు. ఇ ప్పుడు తక్కువ వయసున్న వారూ దీని బారిన పడుతున్నారు. వైరల్‌ లోడ్‌ పెరగడం, వ్యాధి ముదిరే వరకు దాచి పెట్టుకుని క్రిటికల్‌ స్టేజ్‌లో ఆసుపత్రులకు రావడం వల్లే ఇలా జరుగుతోంది. కరోనా వచ్చిం దంటే అదేదో కళంకంగా, ప్రతిష్టకు భంగంగా భావిం చొద్దు. వ్యాధి తీవ్రత ఎక్కువున్న కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. అలాఅని, అందరికీ టెస్ట్‌లు అవసరం లేదు. లక్షణాలు కనిపించే వారితో పాటు, పాజిటివ్‌ల తో కాంటాక్ట్‌ అయిన వారికి తప్పనిసరి చేయాలి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తిని ఆపొచ్చు.

అలా అయితే అది డేంజరే..
నెగెటివ్‌ వచ్చాక 14 నుంచి 28 రోజుల్లోగా రోగనిరోధకశక్తి స్వాధీనంలోకి వస్తుంది. యాంటీ బాడీస్‌ పెరిగి ఇమ్యూని టీ పెరుగుతుంది. అయితే ఏడాది పాటే ఈ ఇమ్యూనిటీ ఉంటుందని, మళ్లీ వ్యాధి తిరగబెట్టే అవకాశాలున్నాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. దీనిపై ఇంకా పరిశోధన లు జరుగుతున్నాయి. మీజిల్స్, ఆటలమ్మ వంటివి మళ్లీ రావు. మలేరియా, టీబీ మళ్లీ తిరగబెడతాయి. కరోనా కూ డా ఆ జాబితాలో చేరితే అది మనకు హెచ్చరికలాంటిదే.

అదే నిజమైతే..
వైరస్‌ తుంపర్ల (డ్రాప్‌లెట్ల) ద్వారా వ్యాపిస్తున్నట్టు నిర్ధారణైంది. కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కూడా ఇది సోకే అ వకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇది సైం టిఫిక్‌గా తేలాలి. ఈ హెచ్చరికను కూడా విస్మరించకూడ దు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకచోట కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నా మాస్క్‌ ధరించాలి. వ్యక్తు ల మధ్య దూరం కచ్చితంగా పాటించాల్సిందే. హ్యాండ్‌ శానిటైజేషన్, వ్యక్తిగత శుభ్రత, పోషకాహారం కలిగిన రోగనిరోధకశక్తి పెంచే ఆహారం తీసుకోవాలి.  

పరీక్షలు.. మందులు.. వ్యాక్సిన్‌
కరోనాలోని రకరకాల లక్షణాలు, రోగి స్థితిని బట్టి వ్యాధి తీవ్రత నిర్ధారణకు ఏ టెస్ట్‌లు చేయాలో డాక్టర్లు నిర్ణయిస్తా రు. యాంటీ బాడీస్, యాంటీ జెన్, హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌ ఫర్‌ లంగ్స్, సీబీపీ–సీఎస్‌ఆర్‌–సీ రియాక్టివ్‌ ప్రోటీన్, ఐ– ఎల్‌ 6, డీ–డైమర్‌ టెస్ట్‌లు.. ఇవన్నీ వివిధ పరీక్షల రకాలు. వ్యాధి తొలిదశలో ఉన్న వారి నుంచి వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ల వరకు అవసరాన్ని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమిల్, ఫాబిఫెరవీర్, రెమ్‌డిసివర్, టోసిలిజుమాబ్‌ మం దుల్ని వాడుతున్నారు. డెక్సామిటాజోన్‌ అనే స్టెరాయిడ్స్‌ లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్‌గా ఉపయోగపడుతోంది. ఇంత కంటే ప్రభావితమైన మందుల కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇక, కొందరు ఇదిగో వ్యాక్సిన్‌ అంటున్నారు. అయితే సరైన వ్యాక్సిన్‌ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతానికివన్నీ పరిశోధనల దశలోనే ఉన్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు