డాక్టర్‌ మీనాకుమారి కన్నుమూత

19 Jan, 2020 05:07 IST|Sakshi

లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్‌ వైద్యురాలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 

లక్డీకాపూల్‌: నిమ్స్‌లో సీనియర్‌ న్యూరో ఫిజీషియన్, న్యూరాలజీలోని ఓ వి భాగానికి అధిపతి డాక్టర్‌ ఏకే మీనాకుమారి (59) శనివారం మధ్యాహ్నం 3.19 గంటలకు లండన్‌లో తుదిశ్వాస విడిచారు. లండన్‌లో ఈనెల 14న జరిగిన న్యూరో సదస్సు లో ప్రసంగిస్తూ ఛాతీలో నొప్పితో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆస్పత్రికి తరలించిన ఆమె కు శస్త్రచికిత్స నిర్వహించినా ఆరోగ్యం కుదుటపడకపోగా, ఎడమ వైపు బ్రెయిన్‌ చచ్చుపడిపోయింది. చివరికి బ్రెయిన్‌ డెత్‌ కావడంతో మీనాకుమారి మరణించినట్లు లండన్‌ వైద్యులు నిర్ధా రించారు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. న్యూరో ఫిజీషియన్‌ న్యూరాలజీ సమస్యతోనే మరణించడంతో కుటుంబ సభ్యు లు, నిమ్స్‌ వైద్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.  నిమ్స్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.  కాగా, డాక్టర్‌‡ మీనాకుమారి మృతి చెందినట్లు యూకే డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మీ నాకుమారి కుటుంబానికి, సన్నిహితులకు సం తాపాన్ని ప్రకటించారు. తమిళనాడుకు చెందిన మీనాకుమారి  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. రెసిడెంట్‌ డాక్టర్‌గా నిమ్స్‌లో వైద్య సేవలను ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్లుగా న్యూరో ఫిజీషియన్‌గా పనిచేస్తూ అందరి మనస్సులో చెరగని ముద్ర వేశారు.

మరిన్ని వార్తలు