-

వైరస్‌ను అంతం చేసే యూవీ బ్లాస్టర్‌...

5 May, 2020 03:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన యూవీ డిసెన్ఫెక్షన్‌ టవర్‌ ఇది. అతినీలలోహిత కిరణాలను వెదజల్లడం ద్వారా ఇది పరిసరాల్లోని వైరస్‌ను చంపేస్తుంది. రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని డీఆర్‌డీవో తెలిపింది. యూవీ బ్లాస్టర్‌ అని పిలుస్తున్న ఈ యంత్రాన్ని లేజర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ అభివృద్ధి చేసిందని, న్యూఏజ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ (గుర్‌గ్రామ్‌) తయారు చేసిందని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.

కార్యాలయాల్లో, పరిశోధనశాలల్లోని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను, కంప్యూటర్లను ఈ యంత్రం సాయంతో శుద్ధి చేయవచ్చు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్, మెట్రో రైళ్లు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లోనూ దీన్ని వాడుకోవచ్చని డీఆర్‌డీవో తెలిపింది. ఒక్కో యంత్రం 12 అడుగుల వెడల్బు, 12 అడుగుల పొడవు ఉన్న గదిని పది నిమిషాల్లో శుభ్రం చేస్తుందని, 400 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు 30 నిమిషాల సమయం పడుతుందని వివరించింది. మొబైలఫోన్‌/ల్యాప్‌టాప్‌ల ద్వారా కూడా పనిచేయగల ఈ యంత్రం శక్తిమంతమైన 254 నానోమీటర్ల అతినీలలోహిత కాంతితో వైరస్‌ను నాశనం చేస్తుంది.

మరిన్ని వార్తలు