బంగారం రాకెట్‌ ఎత్తులకు..డీఆర్‌ఐ చెక్‌

3 Feb, 2020 03:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెన్నై నుంచి ఓరుగల్లుకు విదేశీ బంగారాన్ని అత్యంత రహస్యంగా తరలిస్తోన్న రాకెట్‌ గుట్టును డీఆర్‌ఐ అత్యంత చాకచక్యంగా ఛేదించింది.ముఠా వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారికి చెక్‌ చెప్పింది. కేవలం రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు జరిపిన దాడుల్లో అధికారులు రూ.13 కోట్ల విలువైన 31 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషా బాద్‌ విమానాశ్రమంలో ఆధునిక స్కానర్లు పెరి గిన దరిమిలా.. దొంగబంగారం రవాణా చైన్నైకి మార్చారు స్మగ్లర్లు. ఈ నేపథ్యం లో ఎలాంటి రశీదులు లేకుండా తక్కువ ధరకు దొరికే విదేశీ పుత్తడిని మన వ్యాపారులు చెన్నైలోని బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
జనవరి 31 చెన్నై నుంచి వరంగల్‌ వెళ్లే ట్రైన్‌నెం 12969 జైపూర్‌ ఎస్‌ఎఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో విజయవాడ వద్ద డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3.05 కోట్ల విలువైన 7,228 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నా రు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అరెస్టు చేశారు. తాము ఆ బంగారాన్ని చెన్నైలో కొని, వరంగల్‌కు తీసుకెళ్తున్నామని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 1న విజయవాడ రైల్వేస్టేషన్‌లో అదే తరహాలో మరికొందరు డీఆర్‌ఐకి చిక్కారు. చెన్నై నుంచి వరం గల్‌ వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌లో చేపట్టిన తనిఖీ ల్లో వారి వద్ద రూ.2.99 కోట్ల విలువైన 7055 గ్రాముల బంగారం లభించింది. 

స్వాధీనం చేసుకున్న బంగారం

మరిన్ని వార్తలు