వాగులు ఖాళీ

31 May, 2014 02:56 IST|Sakshi

జిల్లాలో డార్క్ ఏరియాగా గుర్తించిన మిడ్జిల్ మండలంలోని దుందుబీ వాగు పరి వాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోంది. ఇప్పటికే వందల మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటి పోయా యి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాల వృద్ధికి నేషనల్ వాటర్‌షెడ్, డీపీఏపీ వాటర్‌షెడ్, నీ రుమీరు, ఈజీఎస్, డీఎఫ్‌ఐడీ తదితర పథకాల ద్వారా వ్యవసాయ పొలాల్లో వాలుకట్టలు, చెక్‌డ్యామ్‌లు, గల్లీకంట్రోల్, ల్యాండ్ లెవలింగ్, ఊటకుంటలు, ఫాంపండ్‌లు, ఇం కుడుగుంతలు, వంటి పనులు చేపట్టడంతోపాటు దాదాపు వంద కోట్ల నిధులను వెచ్చించి బాలానగర్ మండలం మొదలుకుని జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీ వాగుపై భారీ చెక్‌డ్యామ్‌లను ని ర్మించారు. ఇన్ని చేసినా ఇసుక తరలింపుతో లక్ష్యం బూడిలో పోసిన పన్నీరులా మారుతోంది.
 
 ఇదీ సంగతి..
 వివిధ ప్రభుత్వ పనుల నిర్మాణాలకు కొన్ని క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక అవసరముం దంటూ అధికారుల నుంచి కాంట్రాక్టర్లు అ నుమతులు తీసుకుంటున్నారు. తర్వాత ని బంధనలను పక్కనపెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు వాగులవంక చూడకపోవడంతో రే యింబవళ్లు ఇష్టానుసారంగా యంత్రాల సా యంతో వాగును తోడేస్తున్నారు. రోజుకు వందల సంఖ్య లారీల్లో ఇసుక పట్టణ ప్రాం తాలకు తరలుతోంది. ఈ వ్యవహారంలో తలదూర్చకూడదని అధికారులు, నాయకులు, చివరికి మీడియా ప్రతినిధుల అండదండలు తీసుకోవడానికి గురువారం రాత్రి జడ్చర్లలోని ఓ త్రీస్టార్ హోటల్‌లో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
 
 చిన్నవాగులూ మటుమాయం
 పాన్‌గల్ మండలం తెల్లరాళ్ళపల్లి, చిక్కేపల్లి, బొల్లారం, వల్లభాపూర్, రాయినిపల్లి గ్రామాల్లోని చిన్నవాగులు, చెరువులు మటుమాయమవుతున్నాయి. ఈ గ్రామాల మీదుగా నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆయా గ్రామాల రైతులు, యువకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేసినా సరే.. చూస్తాం.. వస్తాం.. అంటూ పట్టించుకోవడంలేదు. ఒకవేళ దాడికి వచ్చినా ముందస్తు సమాచారం ఉండటంతో ట్రాక్టర్ల యజమానులు అధికారులు వచ్చేసరికి పరారవుతున్నారు.
 
 మస్తు ఫిర్యాదులిచ్చినం
 వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, మా బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు రైతులందరం కలిసి  మస్తుసార్లు ఫిర్యాదులు చేసినం. ఎవరూ పట్టించుకుంటలేరు.
 - చిన్నయ్య, రైతు, తెల్లరాళ్లపల్లి
 
 కేసులు పెట్టాలి
 మేం పట్టుకుంటం. కానీ లా భం లేకుండా పోతుంది. పో లీసులు గట్టి కేసులు పెడితే ఈ దందా ఆగిపోతది. మేం చెబితే ట్రాక్టర్ యజమానులకు మాకు గొడవలు జరుగుతున్నాయి. అందుకే అధికారులే దాడులు చేయాలి.
 - బాల్యానాయక్, గిరిజనసంఘం నాయకులు  
 
 పట్టించుకుంటాం
 మండలంలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలింపుపై మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్‌లను చాలాసార్లు పట్టుకొని జరిమానా విధిం చాం. డంపింగ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తాం.
 - ధన్‌వాల్, తహశీల్దార్, పాన్‌గల్
 
 పంటపొలాల్లో డంపింగ్
 ఉదయం వేళ ట్రాక్టర్లు, మినీ వ్యాన్లలో వ్యవసాయ పొలాలు, పండ్ల తోటల్లో వాగుల నుంచి ఇసుకను తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారికి ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలను చూయిస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకొని దాడులు చేస్తేగాని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేరని వాగు పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు